నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారు ఆరుద్ర..
ఇటీవలి కాలంలో రైళ్ళకన్నా ఈ జీవిత సత్యం సిటీ బస్సులకు మాత్రం తప్పకుండా వర్తిస్తోంది.
ప్రతిరోజూ బస్టాపుల్లో గంటలతరబడి బస్సులకోసం ఎదురుచూడడం, తీరా ఆ బస్సు వచ్చినా దాని కోసం నిర్దేశించిన స్థలంలో అది ఆగక దూరంగా ఆగడం, అందుకోవడం కోసం పరుగులు పెట్టడం సగటు మధ్యతరగతి జీవులకి మామూలే. తీరా బస్ ఎక్కలేక పోతే నిరాశతో వెనక్కి వచ్చినా కూర్చోవడానికి సరైన చోటు లేక నిలబడి ఉండవలసిందే. చాలా బస్టాపులు దుర్గంధానికి నిలయాలు. మారు మూల ప్రాంతాలలో అంటే అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద రోడ్ల కూడళ్ళు జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాలు అన్నిటిలోనూ బస్టాపులన్నీ అశుభ్రత కి చిరునామాలే.
బస్సులో ప్రయాణం అనే శిక్షలో ఎండకు ఎండుతూ, వర్షానికి నానుతూ, చలికి ఒణుకుతూ బస్టాపుల్లో బస్సులకోసం గంటలతరబడి నిరీక్షించడం కూడా ఒక భాగం.
ఒక వర్షం రోజున హైదరాబాద్ హైకోర్టు పక్కన కొంతమంది బస్ కోసం నిరీక్షిస్తున్న దృశ్యం ఇది.
అయితే చాలా దేశాలలో బస్ స్టాపులను ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారో చూస్తే చాలా ముచ్చటేసింది. నిరీక్షణలో కూడా ఎంత సుఖముందో కదా అనిపించక మానదు ......ఇక్కడ కొన్ని బస్టాపులను చూస్తే.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో బస్టాపులు ఎలాఉన్నాయో చూడండి. కొన్ని ఇప్పటికే నిర్మించబడి వాడుకుంటున్నవి కాగా మరికొన్ని కొత్తగా డిజైన్ చేయబడినవి. మన భారతదేశంలో కూడా ఇలాంటి బస్టాపులు చూడాలంటే మరెంత కాలం పడుతుందో....!!!!!!
Thursday, December 30, 2010
Thursday, December 23, 2010
సిత్రాలు సూడరో....
కుడ్య చిత్రాలు అంటే గోడలనే కాన్వాస్ గా చేసుకొని వేసే చిత్రాలు -మనకి కొత్తేం కాదు. ప్రపంచదేశాలలో మానవ నాగరికత వికసించిన తొలి నాళ్ళలోనే ఆనాటి మానవసమాజం అనుభవించిన విషయాలన్నీ బొమ్మల రూపంలో గుహలలో గోడలమీద చిత్రాలుగా అప్పటి మానవులు చిత్రించారని చరిత్ర చెప్తోంది. ఆనాటి మానవసమాజపు విశేషాలు తెలుసుకోవడానికి అవి ఆధారాలుగా నిలిచాయి కూడా.
భారతదేశంలో క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవిగా చెప్పుకొనే అజంతా గుహలలో ఆనాటి కళాకారులు చిత్రించిన చిత్రాలు నేటికీ సజీవంగా రూపుకడుతూ కనువిందు చేస్తాయి. అవన్నీ కుడ్య చిత్రాలే.
అజంతా గుహల్లో కుడ్యచిత్రాలన్నీ చాలావరకు బుద్ధదేవుని జీవిత విశేషాలలను తెలియచేస్తూ చిత్రించినవే. గుహల పైకప్పుల పైన, పక్క గోడలపైన రంగులతో చిత్రించిన ఈ బొమ్మలు కాలగతిలో కొంత శిథిలమైనా ఈనాటికీ మనల్ని సంభ్రమ పరుస్తాయి.
ఇలా చిత్రాలతో గోడలను అలంకరించడం అనే కళ మనకు అంత పాతకాలంనుంచి కనిపిస్తోంది. వీటిని ఇంగ్లీషులో మ్యూరల్స్ అంటారట. ఇవన్నీ 2డైమెన్షన్ చిత్రాలు కదా.
ఇప్పుడు ఈ మ్యూరల్స్ 3డైమెన్షన్ లో అద్భుతంగా చిత్రించబడుతున్నాయి. మూడో డైమెన్షన్ ని ఎంత నైపుణ్యంతో చిత్రించారో, ఎంత అద్భుతంగా ఆ చిత్రీకరణ జరిగిందో ఇక్కడి మ్యూరల్స్ చూస్తే తెలుస్తుంది.
అలాంటి కొన్ని మ్యూరల్స్ ఇక్కడ చూడండి. అదరహో అనిపించకపోతే అడగండి.
ఇక్కడ విరిగిపోయినట్టు కనిపిస్తున్నగోడతో పాటు తొంగి చూస్తున్న అతివ కూడా చిత్రంలో భాగమే అంటే నమ్మశక్యమా.....
ఏ భూకంపం తాకిడికో చెదిరిపోయిన హాలు లా ఉంది కదూ ఈ పెయింటింగ్ ..... కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లో ఓ కుడ్య చిత్రం ఇది. ఇక్కడి స్థంభాలు కూడా చిత్రంలో భాగమేనని వేరే చెప్పక్కర్లేదుగా.
ఈ చిత్రంలో చిత్రం చూసారా.... ఆ గొట్టంలో సముద్రాన్ని చిత్రించినట్టుంది కదూ. కానీ దాంతో పాటు అందులోకి చూస్తున్న ఆ బాటసారి కూడా ఆ పెయింటింగ్ లో భాగమే అంటే ....అవును. పైనుంచి కింద పేవ్ మెంట్ లా కనిపిస్తున్న భాగం వరకు అంతా ఒకే చిత్రం.
హవాయ్ ద్వీపంలోని హొనలూలు లో ఈ మ్యూరల్ ని చిత్రించారు.11 మంది సహాయకులతో, రెండునెలలు స్టూడియోలో, మరో ఆరు నెలలు బయట కష్టపడితే ఈ పెయింటింగ్ పూర్తయిందిట. హవాయ్ ద్వీపపు ఆఖరి మహారాణి Liluokalani ఈ చిత్రంలో చూడవచ్చు.
కాలిఫోర్నియా సాన్ జోస్ లో ఒక కేఫెటేరియా గోడలమీద ఈ చిత్రం కనిపిస్తుంది. మెట్లు దిగుతూ ఆగిపోయిన పిల్లి, గోడమీద అమర్చిన పెయింటింగ్ లో తోట,గోడలు వాటి నీడలు, చీకటి వెలుగుల్లో వాటి రూపాలు అన్నీ ఎంత స్పష్టాతి స్పష్టంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా చిత్రించారో చూడండి. ముఖ్యం కెఫెటేరియా మూసేసే సమయాన్ని కూడా గమనించకుండా చదువుతూ కూర్చుండిపోయిన యువతి....నిజంగా అక్కడకూర్చున్నట్టుగానే అనిపిస్తోంది కదా.
ఫ్లోరిడాలో సరసోటా కంట్రీ హెల్త్ సెంటర్ లోది ఈ దృశ్యం. నడిచి నడిచి అలసిపోయి కాళ్ళుజాపుకొని కూచోడానికి ఇక్కడ బావుంటుందనుకున్నారనుకోండి. వాళ్ళ పప్పులేం ఉడకవు. ఎందుకంటే ఇది మొత్తం ఓ గోడమీద చిత్రం కాబట్టి.
అలనాడు భారతంలో దుర్యోధనుడు ఏది మడుగో, ఏది కాదో తెలియక తడబడిన ఘట్టాన్ని విన్నాం.
ఈకాలంలోను అలాంటి భ్రమలకి గురిచేయగల శక్తి ఉన్న అపర మయబ్రహ్మ లున్నారని నిరూపిస్తున్నాయి ఈ చిత్రాలు.
ఈ చిత్రాల రూపకర్త, కలి కాలపు మయుడు ఇదిగో ఇతనే..... JOHN PUGH !!!!!
ఈ గొప్ప చిత్రకళాకారుడు జాన్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. అతను చేసిన చిత్రాల నేపథ్యం తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.

Wednesday, November 10, 2010
చూడు చూడు గోడలు.....
పాత గోడలు....
సున్నం రాలిపోతూ, పెచ్చులు ఊడిపోతూ, కళావిహీనంగా,
రోడ్డు పక్కన దీనంగా, గడిచిపోయిన చరిత్రకు మూగ సాక్ష్యాలుగా
మారుతున్న నాగరికజీవుల కంటికి తాగిపడేసిన కాఫీ కప్పు మరకలా
అలనాటి వైభవాలను నెమరేస్తూనో....
సగం తెగిన కళేబరాలను గుర్తుచేస్తూనో,
కొత్త ఒక వింత కాగా రోతకలిగిస్తూ ,
రూపుమాసిన మొండిగోడలు.....
మృత్యుకుహరంలా నోరు తెరుచుకు వచ్చే బుల్డోజర్ బారిన పడిన
నాశనం కాక తప్పని క్షణాల కోసం,
యముడి మహిషపు లోహ ఘంటలు గుమ్మంలో ఘల్లుమనక తప్పదని
తప్పించుకోలేనని తెలిసిన నిస్సహాయతతో
అది ఏ ఘడియో క్షణమో తెలియకున్నా దాని కోసం ఎదురుచూడనట్టుగా చూస్తూ
అసహాయంగా చూసే ముసలి వగ్గులా....
పాతగోడలు...
మీరూ నేనూ....
వాటిని గోకితే ఏమొస్తుంది ..
బోలెడు ఇటుక పొడి, చారెడు సున్నం పొడి తప్ప....
కానీ అలెగ్జాండ్రా ఫోర్టు గీకితే........
అద్భుతమైన కళా ఖండాలు ఆవిష్కరించబడతాయి.
మహాకవి శ్రీశ్రీ అన్నట్టు కళా విహీనం అని దేనినీ తీసి పారేయడానికి లేదు. వెతికితే ' దొరకదటోయ్ శోభా లేశం 'అన్న వాక్యాలకు ఉదాహరణలూ దొరుకుతాయి.
ఇదిగో ఈ మొండి గోడలే అందుకు సాక్ష్యం.
లండన్ దేశంలో నివసిస్తూ పోర్చుగల్ దేశానికి చెందిన ఈ వీధి కళాకారుడి పేరు - అలెగ్జాండ్రా ఫోర్ట్.
మరోపేరు విల్స్.
మాస్కో, న్యూయార్క్, లండన్, పోర్చుగల్ మొదలైన దేశాలో పాడుబడిపోయిన గోడలన్నీ అలెగ్జాండ్రా చేతుల్లో సుందరమైన ముఖాకృతులను దిద్దుకున్నాయి.
ఒక గొప్ప వీధి కళాకారుడిచేతిలో ఈ పాత మొండిగోడలు ఎంత గొప్ప కళాకృతులుగా మారిపోయాయో చూడండి.
పెచ్చులురాలిపోతున్న పాతగోడలను కావలసిన చోట్ల మరికాస్త పెచ్చులూడదీస్తూ కళారూపాలుగా వాటిని తీర్చి దిద్దుతున్న తీరును చూపే వీడియో కూడా .....ఇదిగో ఇక్కడ చూడండి.

Subscribe to:
Posts (Atom)