"హలో... హలో ....."
"హలో గుడీవినింగ్..........టెక్నికల్ డెస్క్ కి స్వాగతం."
"హలో....నాకు వర్డ్ పర్ఫెక్టుతో ఒక సమస్య వచ్చిందండి."
"మీ సమస్య ఏమిటో చెప్పండి. తప్పకుండా సహాయం చేస్తాం."
"మరేం లేదండీ. నేను మా కంప్యూటర్ లో ఇలా టైప్ చేస్తూ ఉన్నానా...హఠాత్తుగా అక్షరాలన్నీ మాయమయిపోయాయండీ."
"మాయమా....అదెలా."
"అవును....మాయమయిపోయాయి."
"ఓహో...అలాగా. సరే. ఇప్పుడు మీ స్క్రీన్ ఎలా కనిపిస్తోంది ? "
"స్క్రీన్ పైనా...ఏమీ లేదక్కడ."
"ఏమీ లేదా..."
"అవును. అక్కడంతా ఖాళీగా ఉంది. నేను ఏది టైప్ చేసినా అక్కడ కనిపించడం లేదు."
"మీరు ఇంకా వర్డ్ లోనే ఉన్నారా ? బయటకు వచ్చేసారా "
" నా కర్థం కాలేదు. అది నేనెలా చెప్పగలను? "
"అంటే....అదే... మీకు కంప్యూటర్ మీద సి ప్రామ్ ట్ కనిపిస్తోందా? "
" సీ ప్రామ్టా....అంటే...? "
" సరేలెండి. స్క్రీన్ మీద కర్సర్ ని ఉంచితే అది కదులుతోందా? "
" కర్సర్ లేదు ఏంలేదు. చెప్తున్నా కదా - అక్కడ ఏమీ కనిపించడం లేదని "
" సరే. మీ మానిటర్ కి పవర్ ఇండికేటర్ ఉందా? "
" మానిటరా...మానిటర్ అంటే ఏది? "
" అదే టివిలాగా కనిపించే తెరని మానిటర్ అంటారు. దాంట్లోనుంచి కొంచెం వెలుగు వస్తోందా?
అది కనెక్టు అయి ఉన్నట్టు తెలియడానికి ? "
" ఏమో నాకు తెలీదు !! "
" సరే. మీరు మానిటర్ వెనక భాగానికి వెళ్ళి పవర్ వైర్ దానికి తగిలించి ఉందో లేదో చూడండి"
...............
" చూసారా ? "
" తగిలించినట్టే ఉంది"
" ఓహ్. గ్రేట్ !! అలాగే ఆ వైర్ గోడకి ఉన్న ప్లగ్ కి తగిలించి ఉందో లేదో చూడండి "
" ఆ......తగిలించి ఉంది "
" మీరు మానిటర్ వెనక నుంచొని చూస్తే మీకు రెండు వైర్లు కనిపిస్తున్నాయా ? "
" ఊహు.లేదు "
" కాదండీ. రెండు వైర్లు ఉంటాయి. ఒకసారి ఆ మానిటర్ వెనక్కి వెళ్ళి రెండు వైర్లు ఉన్నాయో లేదో చూడండి "
"ఆ ....ఇక్కడ ఉంది "
" ఆ ...ఆ వైర్ ని మీ కంప్యూటర్ కి తగిలించి ఉందో లేదో చూడండి "
" ఊహు....నాకు అందడం లేదు "
" అవునా. సరే అది అక్కడ ఉన్నట్టు కనిపిస్తోందా "
" లేదు. నాకు అంతదూరం కనిపించడం లేదు "
" కొంచెం మోకాళ్ళమీదకు వంగి గాని , గోడకు చేరబడో చూడగలరేమో చూడండి "
" లేదు. నేను చూడలేను. నాకు ఆ భంగిమలో చూడడం రాదు. పైగా ఇక్కడ చీకటిగా ఉంది !! "
" చీకటా....? "
" అవును..ఆఫీస్ లో లైట్లన్నీ ఆఫ్ చేసేసారు. కిటికీ లోంచి వస్తున్న వెలుగు మాత్రమే ఇక్కడుంది "
" అయితే లైట్ వేసుకోండి "
" ఊహు....."
" వెయ్యరా...... ఎందుకని...?? "
" ఎందుకంటే ....మరి కరెంట్ లేదు. పోయిందిగా.."
" కరెంట్......కరెంట్ లేదా...పోయిందా...ఆహా....సరే. ఇప్పుడు మాకు మీ సమస్య ఏమిటో అర్థం అయింది "
" ఇప్పుడేం చెయ్యమంటారు మరి ? "
" మీరు కంప్యూటర్ కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ ప్యాకేజి బాక్సులు అన్నీ అలాగే ఉన్నాయా ? "
" ఓ...అన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. అన్నీ అల్మైరాలో దాచి ఉంచాను "
" మంచి పని చేసారు. వెళ్ళి వాటిని బయటకి తియ్యండి. కంప్యూటర్ కి ఉన్న ప్లగ్లన్నీ తీసి జాగ్రత్తగా మీరు షాప్ లో కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ప్యాక్ చేసి పెట్టండి "
" అవునా...కంప్యూటర్ లో అంత సమస్య ఉందా...పాడయిపోయిందా? "
" అవును...అలాగే కనిపిస్తోంది "
" అలాగా....సరే మరి. ఆ షాప్ వాళ్ళకి సమస్య ఏమిటీ అంటే ఏం చెప్పను ? "
" కంప్యూటర్ వాడడానికి అర్హత లేని ఒక వెధవనని నేనూ... అని ............చెప్పండి!!

No comments:
Post a Comment